ఐపీఎల్ 2020 : రాజస్థాన్ ను దెబ్బతీసిన హోల్డర్...

ఐపీఎల్ 2020 : రాజస్థాన్ ను దెబ్బతీసిన హోల్డర్...

ఈ రోజు ఐపీఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ ను సన్‌రైజర్స్ బౌలర్లు బాగానే కట్టడి చేసారు. ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ రాయల్స్ ను గట్టిగానే దెబ్బ తీసాడు. వేసిన 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసాడు. అయిన రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ సంజు సామ్సన్ (36), బెన్ స్టోక్స్ (30) రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది ఆ జట్టు. సన్‌రైజర్స్ బౌలర్లలో హోల్డర్ కి తోడుగా విజయ్ శంకర్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే హైదరాబాద్ 155 పరుగులు చేయాలి. కానీ సన్‌రైజర్స్ చాలా మ్యాచ్ లలో ఈ లక్ష్యానే చేధించలేక ఓడిపోయింది. కానీ వచ్చిన మొదటి మ్యాచ్ లోనే బాల్ తో అదరగొట్టిన ఆల్ రౌండర్ హోల్డర్ బ్యాట్ తో కూడా రాణిస్తే జట్టుకు విజయావకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది.