ఐపీఎల్ 2020 : ముగిసిన కేకేఆర్ ఇన్నింగ్స్... సన్‌రైజర్స్ లక్ష్యం..? 

ఐపీఎల్ 2020 : ముగిసిన కేకేఆర్ ఇన్నింగ్స్... సన్‌రైజర్స్ లక్ష్యం..? 

ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ కోల్‌కత ను బాగానే కట్టడి చేసింది. జట్టు ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి(23) షుబ్మాన్ గిల్(36) మంచి ఆరంభాని అందించిన తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ దానిని నిలబెట్టుకోలేదు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో కోల్‌కత ఎప్పుడు కూడా భారీ పరుగులు చేసే విధంగా కనిపించలేదు. కానీ చివర్లో కెప్టెన్ మోర్గాన్ (34) తో కలిసి మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో కలిపి 14 బంతుల్లో 29 పరుగులు చేయడంతో కోల్‌కత నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో టి నటరాజన్ 2 వికెట్లు తీసుకోగా విజయ్ శంకర్, రషీద్ ఖాన్, బాసిల్ తంపి ఒక్కో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ గెలవాలంటే 164 పరుగులు చేయాలి. కానీ జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో తో కలిపి విలియమ్సన్ ఒక్కడే రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో మరో బాట్స్మెన్ ఎవరైనా పరుగ్గులు చేయకపోతే హైదరాబాద్ గెలుపు కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే సన్‌రైజర్స్ 160 పరుగుల వద్ద ఉన్న లక్ష్యానే చేధించలేక ఇప్పటికి రెండుసార్లు ఓడిపోయింది. చూడాలి మరి ఈ మ్యాచ్ ఎవరు విజయం సాధిస్తారు అనేది.