'రైజర్స్' నల్ల రిబ్బన్లు ఎందుకు ధరించారంటే..

'రైజర్స్' నల్ల రిబ్బన్లు ఎందుకు ధరించారంటే..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్‌ తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఏంటంటే.. ఆఫ్ఘనిస్థాన్‌లోని నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లో రెండు రోజుల క్రితం బాంబు దాడి జరిగింది. సన్‌రైజర్స్‌ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ ప్రాణ స్నేహితుడు ఈ బాంబు దాడిలో మరణించారు. దీంతో.. రషీద్‌ ఖాన్‌తోపాటు  ఆటగాళ్లంతా నల్ల రబ్బన్లు ధరించారు. నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగడంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌ ద్వారా సన్‌రైజర్స్ కు థ్యాంక్స్ చెప్పింది.