సన్ రైజర్ హైదరాబాద్ టార్గెట్: 156

సన్ రైజర్ హైదరాబాద్ టార్గెట్: 156

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో పృథ్వీ షా(4) ఔట్ అయ్యాడు. ఆ వెంటనే శిఖర్ ధవన్(7) భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కొలిన్ మున్రో(40), శ్రేయస్(45), పంత్(23) పరుగులు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలింగ్‌లో ఖలీల్ 3, భువనేశ్వర్ 2, అభిషేక్, రషీద్ తలో వికెట్ తీశారు.