సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ

డేవిడ్ వార్నర్ చెలరేగడంతో సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ మొదట 2 వికెట్లకు 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెలరేగి ఆడిన సంజు శాంసన్‌ (102 నాటౌట్‌; 55 బంతుల్లో 10ఫోర్లు, 4 సిక్స్) సెంచరీతో అజేయంగా నిలవగా.. కెప్టెన్‌ ఆజింక్య రహానె (70; 49 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స్) బాధ్యతాయుతంగా ఆడాడు. ఐతే వార్నర్‌ విధ్వంసానికి బెయిర్‌స్టో (45; 28 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్), విజయ్‌ శంకర్‌ (35; 15 బంతుల్లో 1ఫోర్, 3సిక్స్) దూకుడు తోడవడంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది.