హైదరాబాద్ ఆల్ రౌండ్ ప్రదర్శన... ఢిల్లీ చిత్తు... 

హైదరాబాద్ ఆల్ రౌండ్ ప్రదర్శన... ఢిల్లీ చిత్తు... 

గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు సమిష్టిగా రాణించి విజయం రాణించి విజయం సాధించింది.  ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది.  ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.  220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది.  దీంతో హైదరాబాద్ జట్టు తేడాతో విజయం సాధించింది.  జట్టులో రిషబ్ పంత్ మినహా ఎవరూ రాణించలేదు.  వార్నర్, సాహా, మనీష్ పాండేలు బ్యాట్ తో రాణిస్తే, సందీప్ శర్మ, రషీద్, నటరాజన్ లు బాల్ తో మెరుపులు మెరిపించారు.  ఈ విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా, ఓటమితో ఢిల్లీ జట్టు మూడో స్థానానికి పడిపోయింది.