ఐపీఎల్‌-2020 : దుమ్ములేపిన సన్‌ రైజర్స్‌...టోర్నీ నుంచి బెంగుళూరు బౌట్‌

ఐపీఎల్‌-2020 : దుమ్ములేపిన సన్‌ రైజర్స్‌...టోర్నీ నుంచి బెంగుళూరు బౌట్‌

చావో, రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బెంగుళూరుపై సన్‌రైజర్స్‌  అద్భుత విజయం సాధించింది. ఆరు వికెట్లతో తేడాతో గెలిచి..ఫైనల్‌ రేస్‌లో నిలిచింది. మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ బెంగుళూరును కట్టడి చేయడంలో సఫలమైంది. దీంతో విజయకేతనం ఎగురవేసింది వార్నర్‌ సేన. ఇక మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు..ఆరోన్‌ ఫించ్‌ 32, డివిలియర్స్‌ 67 పరుగులు చేసి రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఇక 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ మొదట వికెట్లు కోల్పోయి తడబడింది. కానీ ఆ తర్వాత విలియమ్సన్‌  50 పరుగులతో రాణించడంతో క్వాలిఫైర్‌-2 కి దూసుకెళ్లింది హైదరాబాద్‌. అర్ధశతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విలియమ్సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  అటు ఫైనల్స్‌కి వెళ్లాలంటే క్వాలిఫైర్‌-2లో ఢిల్లీపై కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది.