ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్ 2020 లో 9 మ్యాచ్ లు ఆడిన సన్‌రైజర్స్ 3 మ్యాచ్ లలో విజయం సాధిస్తే 10 మ్యాచ్ లలో 4 గెలిచింది రాయల్స్. అందువల్ల ఈ మ్యాచ్ లో ఎవరు గెల్సితే వారే ప్లేఆఫ్ రేస్ లో నిలుస్తారు. ఓడిన వారు చెన్నై తో కలిసి ఇంటిదారి పట్టాల్సిందే. చూడాలి మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), ప్రియమ్ గార్గ్, మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

రాజస్థాన్ : బెన్ స్టోక్స్, రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్ (w), స్టీవ్ స్మిత్ (c), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగి