ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న హైదరాబాద్... 

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న హైదరాబాద్... 

ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే గత కొన్ని మ్యాచ్ ల నుండి టాస్ చాలా కీలకంగా మారింది. నిన్న ఢిల్లీ మినహాయించి ఎక్కువ మ్యాచ్ లలో లక్ష్యాన్ని చేధించిన జట్టే విజయం సాధించింది. అయితే ఇప్పుడు బెంగుళూరు మొదట బ్యాటింగ్ చేయనుండటంతో సన్‌రైజర్స్ లక్ష్య చేధనకు దిగనుంది. చూడాలి మరి ఛేదనలో హైదరాబాద్ విజయం సాధిస్తుందా... లేదా ఢిల్లీ లాగా బోల్తా కొడుతుందా అనేది.

బెంగళూరు: ఆరోన్ ఫించ్, దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), మొయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, శివం దుబే, నవదీప్ సైని, ఆడమ్ జాంపా, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), శ్రీవాట్స్ గోస్వామి (w), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్