బిగ్ బి పూర్తి చేశాడు

బిగ్ బి పూర్తి చేశాడు

సైరా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  సినిమా షూటింగ్ పార్ట్ పూర్తికాగానే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ను స్టార్ట్ చేస్తారు.  విజువల్ గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.  పాన్ ఇండియా మూవీగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్... మెగాస్టార్ కు గురువుగా నటిస్తున్నారు.  దీనికి సంబంధించిన పార్ట్ ను అమితాబ్ నేటితో పూర్తిచేశారు.  ఈ సందర్భంగా అమితాబ్.. దర్శకుడు సురేందర్ రెడ్డిలు సెల్ఫీ దిగారు.  ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  మెగాస్టార్ కు జోడిగా నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.