కృష్ణ కుటుంబ సమేతంగా...

కృష్ణ కుటుంబ సమేతంగా...

డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి మహర్షి స్పెషల్ షో ను వీక్షించారు.  స్టూడెంట్ గా, వ్యాపారవేత్తగా, రైతుగా మూడు పాత్రల్లో మహేష్ చేసిన నటన అమోఘం అని సినిమా చూసిన తరువాత కృష్ణ పేర్కొన్నారు.  విజయ నిర్మల కూడా సినిమాను మెచ్చుకున్నారు.  సీనియర్ నరేష్ సినిమా గురించి మాట్లాడుతూ.. 

ఈ సినిమాను చూడటం ఇది రెండోసారి అని, రైతుగా మహేష్ జీవించాడని, రైతుకు సమాజం రెస్పెక్ట్ ఇవ్వాలనే సందేశం ఎంతగానో నచ్చిందని నరేష్ అన్నారు.  మహేష్ కు ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే సినిమా మహర్షి అని మెచ్చుకున్నారు.