పవన్, రజినీకాంత్, వెంకటేష్‌కు సూపర్ స్టార్ ఛాలెంజ్..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటూ.. మొక్కలు నాటుతూ.. మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు సెలబ్రిటీలు.. సామాన్యులు సైతం ఈ ఉద్యమంలో పాల్గొంటూ చెట్లు నాటుతూ ముందుకు సాగుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటారు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ.. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అభినందించారు సూపర్ స్టార్... ఇక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, విక్టరీ వెంకటేష్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు సూపర్ స్టార్ కృష్ణ.. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాక్షించిన ఆయన.. ప్రతీ ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సూపర్ స్టార్ మొక్కలు నాటిన కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మనం సైతం కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)