దీపావళి ట్రీట్ కి రెడీ అవ్వాలట

దీపావళి ట్రీట్ కి రెడీ అవ్వాలట

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మహర్షి సినిమా తరువాత మహేష్‌, బ్లాక్‌ బస్టర్‌ ఎఫ్‌ 2 తరువాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావటంతో సరిలేరు నీకెవ్వరుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. జనవరి 12న సినిమా రిలీజ్‌ అంటూ అధికారిక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా దీపావళికి ట్రీట్ ఇస్తున్నట్టు ప్రకటించారు ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి. ఈరోజు ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన చదరంగం బోర్డులో కింగ్ ఒక్కడే అనే అర్ధం వచ్చేలా పిక్ పోస్ట్ చేశాడు. అక్కడితో ఆగక విలన్ ఇంట్లో షూట్ పూర్తయిందని ఫైనల్ షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఉన్నామని పేర్కొన్నాడు.