'సైరా' రికార్డులు బ్రేక్‌ చేసిన "సరిలేరు నీకెవ్వరు"!

'సైరా' రికార్డులు బ్రేక్‌ చేసిన "సరిలేరు నీకెవ్వరు"!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సైరా నరసింహారెడ్డి".. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. వాసూళ్లలోనూ సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఇతర భాషల్లోనూ రిలీజై.. మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, సైరాతో చిరంజీవి సృష్టించిన రికార్డును సూపర్ స్టార్ మహేష్‌ బాబు "సరిలేరు నీకెవ్వరు" బీట్ చేసింది.

మెగాస్టార్ "సైరా" మూవీ హిందీ మార్కెట్‌లో డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి రూ. 9 కోట్లు పలకగా.. మహేష్ "సరిలేరు నీకెవ్వరు" ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త రికార్డును సృష్టించినట్టు ఫిల్మ్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది.. "సరిలేరు నీకెవ్వరు" హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి రూ.15.25 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అంటే సైరా మూవీ కంటే సరిలేరు నీకెవ్వరు ఏకంగా రూ.6.25 కోట్లు ఎక్కువ పలికిందనే ప్రచారం నడుస్తోంది.