మరో గుండెకు ఊపిరి పోసిన సూపర్ స్టార్..

మరో గుండెకు ఊపిరి పోసిన సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ రీల్‌లోనే కాకుండా రియల్‌గా హీరో అన్న విషయం ప్రత్యేకంగా చెప్సాల్సిన అవసరం లేదు. తన సంపాదనలో కొంత మేరా చిన్నారులకు చికిత్స కోసం ఖర్చు చేస్తున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారుల గుండెలకు ఆయుష్షు పోసి ఎందరికో దేవునిలా కనిపించాడు. ఈ విధంగా మషేమ్ ఇప్పటికి ఎన్నో వేల మంది చిన్నారులను కాపాడాడు. కొన్ని రోజుల క్రితమే 1019వ చిన్నారి ప్రాణాన్ని కాపాడిన మహేష్ ఇప్పుడు మరో ప్రాణాన్ని కూడా కాపాడాడు. దీంతో ఇప్పటి వరకు మషేష్ పోసిన ప్రాణాల సంఖ్య 1020కి చేరింది. షేక్ రిహాన్ అనే చిన్నారి ట్రయాలజి హార్ట్ సర్జరీతో సేఫ్‌గా బయట పడింది. ఈ విషయం తెలిసిన మహేష్ ఆ చిన్నారి సేఫ్ అని తెలియడంతో తనకు చాలా సంతోషంగా ఉందని ఆ చిన్నారి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాని అన్నాడు. అలాగే ఆ చిన్నారికి వైద్యం చేసిన వైద్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో మహేష్ అభిమానులు తమ హీరోను హీరో విత్ సంప్లిసిటీ అని మెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతా తన ఇన్‌స్టా ద్వారా తెలిపారు. మరో అద్భుత రికవరీ జరిగింది. రిహాన్ కోలుకున్న విషయం చాలా ఆనందాన్ని కలిస్తోంది. రిహాన్ ఆయరారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తానంటూ నమ్రతా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.