విజయ్ సర్కార్ కు రజినీకాంత్ చీఫ్ గెస్ట్..!!

విజయ్ సర్కార్ కు రజినీకాంత్ చీఫ్ గెస్ట్..!!

విజయ్ సర్కార్ షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది.  ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఈ టీమ్, ఆడియో విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నది. చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని యూనిట్ అనుకుంటున్నది.  పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నది.  ఒకవేళ అవకాశం దొరక్కపోతే.. నెహ్రు ఇండోర్ లేదా వైఎంసిఏ స్టేడియంలో ఆడియో వేడుకను నిర్వహించాలని చూస్తున్నది.  విజయ్ సర్కార్ ఆడియోకు ముఖ్య అతిధిగా రజినీకాంత్ రాబోతున్నారట.  సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది.  అటు రజినీకాంత్ 165 వ సినిమా పెట్ట ను కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండటంతో.. రజినీకాంత్ ను ఆడియోకు ఆహ్వానించడం సులభం అయినట్టు తెలుస్తున్నది.  మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో అక్టోబర్ 2 న విడుదల కాబోతున్నది.  దీపావళి పండుగకు సినిమా విడుదలౌతుంది.  విజయ్ సరసన కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ లు నటిస్తున్నారు.