చాక్లెట్లు దొంగిలించాడని... ఇంత దారుణం చేస్తారా? 

చాక్లెట్లు దొంగిలించాడని... ఇంత దారుణం చేస్తారా? 

ఆకలి ఎంతటి పనినైనా చేయిస్తుంది.  ఎంతదూరమైనా తీసుకెళ్తుంది.  ఎలాంటి పనులు చేయించడానికైనా రెడీ అనిపిస్తుంది.  అందుకే ఆకలి ఉన్న వ్యక్తి గొప్ప విజయాలు సాధిస్తారు.  ఒకప్పుడు ఆకలేసిందని చేయి చాపితే ఏదో ఒకటి పెట్టేవారు.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  అందుకే దొంగతనాలు జరిగిపోతున్నాయి.  

బెంగళూరులో ఓ 15 ఏళ్ల కుర్రోడికి ఆకలేసి ఓ షాపులో రూపాయి విలువచేసే రెండు చాక్లెట్లు దొంగతనం చేశాడు.  అదే అతని పాలిట శాపంగా మారింది.  దొంగతనం చేసిన కుర్రోడిని పట్టుకొని చితక్కొట్టారు.  అక్కడితో ఆగకుండా అతనికి గుండు చేసి, కనుబొమలు తీసేశారు. దీంతో ఆ వ్యక్తి భయపడిపోయారు. వదలమని ఎంత మొత్తుకున్నా వినలేదట.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.