మళ్లీ సస్పెన్స్‌ థ్రిల్లర్ 'మర్మదేశం'

మళ్లీ సస్పెన్స్‌ థ్రిల్లర్ 'మర్మదేశం'

వెనుకాల గుర్రం పరుగెత్తుతూ సకిలించే సౌండ్.. గంభీరమైన గొంతుతూ 'మర్మదేశం' అంటూ వచ్చే వాయిస్ వింటే చాలు అంతా టీవీ ముందు వాలిపోయేవారు... 1995 నుంచి 1998 మధ్య ఓ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమై కోట్లాది మంది అభిమాన్ని చురగొన్న సస్పెన్స్‌ థ్రిల్లర్ సీరియల్ 'మర్మదేశం' ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 'మర్మదేశం'  ఇప్పుడు యూ ట్యూబ్‌లో ప్రాసారం చేస్తున్నారు. నిజ జీవితంలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, మూఢ నమ్మకాలను ప్రతిభింబిస్తూ ఈ సీరియల్ సాగుతుంది. వీరభద్రుడనే గ్రామదైవం గుఱ్ఱం మీద వచ్చి తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తాడనే నేపథ్యంతో నడిచే కథ ఇది... ఇకపై ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు యూ ట్యూబ్‌ చానెల్‌లో ప్రసారం అవుతుంది. శుక్రవారం రోజు ఈ సీరియల్‌కు సంబంధించిన 10 ఎపిసోడ్స్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత ఇందిరా సౌందరరాజన్ రాసిన 'విట్టు వీడు కరుప' అనే బుక్ ఆధారంగా ఈ సీరియల్‌ను రూపొందించారు. తమిళం, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ప్రసారమైన ఈ సీరియల్ కోట్లాది మందిని ఆకట్టుకుంది. అయితే, మళ్లీ యూ ట్యూబ్‌ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్ 'మర్మదేశం'.. ఇప్పుడు తమిళంలో మాత్రమే ఉంటుంది.