మహేష్ మొదటి సినిమానుంచి ఆయనే పనిచేస్తున్నారట..!!

మహేష్ మొదటి సినిమానుంచి ఆయనే పనిచేస్తున్నారట..!!

మహేష్ బాబు పూర్తిస్థాయి హీరోగా చేసిన మొదటి సినిమా రాజకుమారుడు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సినిమాలు పూర్తయ్యాయి.  ప్రస్తుతం 26 వ సినిమా చేస్తున్నారు.  సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  మహేష్ సినిమాలు అన్నింటికీ ఒకే వ్యక్తి మారకుండా పనిచేస్తున్నారు.  అయన ఎవరో కాదు.. రికార్డిస్ట్ నగారా రాము.  మొదటి నుంచి నుంచి ఆయన నాతోనే ఉన్నారని మహేష్ బాబు ప్రత్యేకంగా పేర్కొన్నారు.  

మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ సెట్స్ లో నగారా రాముతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  మొదటి సినిమా నుంచి నాతోనే పనిచేస్తున్నారు అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటి.. తనతో కలిసి పనిచేసేవాళ్లకు ఎప్పుడు తన దగ్గర స్థానం ఉంటుందని చెప్పడం కాబోలు.  ఒక హీరోతో కలిసి అన్ని సినిమాలకు పనిచేయడం అంటే గ్రేట్ అని చెప్పాలి.  సినిమా షూటింగ్ లో వాయిస్ ను రికార్ట్ చేయడం చాలా కష్టమైన పని.  దానిని విజయవంతంగా చేస్తున్న వ్యక్తి నగారా రాము.