రజినీకాంత్ ను ఇలా ఎప్పుడైనా చూశారా..?

రజినీకాంత్ ను ఇలా ఎప్పుడైనా చూశారా..?

రజినీకాంత్ పేరు చెప్తే తమిళనాడు ప్రజలకు పూనకం వస్తుంది.  రజినీకాంత్ సినిమాలు తమిళ ఇండస్ట్రీని ఎంతగా ప్రభావితం చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  తన మ్యానరిజంతో, తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రజలకు ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  1975 లో రజినీకాంత్ తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.  ప్రముఖ దర్శకుడు కె బాలచందర్.. రజినీకాంత్ ను అపూర్వ రాగంగళ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశాడు.  

1975 కు ముందు రజినీకాంత్ కర్ణాటక నుంచి చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో ట్రైనింగ్ తీసుకున్నాడు.  ఆ సమయంలో దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలో రజినీకాంత్ రఫ్ లుక్ తో ఉన్నాడు.  అప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ఉన్న ఆ ఫోటో, రజినీకాంత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.