'క్యాబ్‌' ఆందోళనపై తలైవా... ట్విట్టర్‌లో రచ్చ...

'క్యాబ్‌' ఆందోళనపై తలైవా... ట్విట్టర్‌లో రచ్చ...

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి... కొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు హింసకు దారితీస్తున్నాయి. ఇక, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు ప్రముఖులు తప్పుబడుతుంటే.. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై తాజాగా స్పందించారు సూపర్ స్టార్ రజనీకాంత్... దేశంలో కొనసాగుతున్న హింస 'పెద్ద నొప్పి'గా పేర్కొన్న ఆయన.. ఈ హింస నాకు చాలా బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హింస మరియు అల్లర్లు ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనే మార్గం కాదన్న సూపర్ స్టార్... దేశం యొక్క భద్రత మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని భారత ప్రజలను నేను కోరుతున్నానంటూ ట్వీట్‌ చేశారు రజనీకాంత్. 

ఇక, సూపర్ స్టార్ అలా స్పందించారో లేదో... ట్విట్టర్‌లో రచ్చమొదలైంది... తలైవాను సమర్థిస్తూ కొందరు ట్వీట్లు చేస్తుంటే... మరికొందరు... హింసపై రజనీ స్టాండ్ ఓకే.. కానీ పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన స్టాండ్ ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. #IStandWithRajinikanth పేరుతో యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చిందంటే.. రజనీకాంత్ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో ఎంతో రచ్చ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు... అయితే, మొత్తంగా చూస్తే మాత్రం రజనీకాంత్ స్టాండ్‌ను సమర్థించేవారే ఎక్కువగా ఉన్నారు... పౌరసత్వ సవరణ చట్టం పక్కన పెడితే.. హింసకు పాల్పడవద్దు.. అంటూ తలైవా చేసిన విజ్ఞప్తిని అందరూ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు... ఆయన హింసను కోరుకునేవారు కాదు.. ఇలాంటే నేతే తమకు కావాలని కొందరు అంటే.. ఆయన ఒక దేశానికే కాదు... ప్రపంచశాంతిని కాంక్షిస్తున్నారంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు...