నెట్టింట్లో వైరల్ అవుతున్న సూపర్ స్టార్..!! 

నెట్టింట్లో వైరల్ అవుతున్న సూపర్ స్టార్..!! 

సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే.  సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే సూపర్ స్టార్ వారం రోజుల పాటు హిమాలయాల్లో గడిపేందుకు వెళ్లారు.  చెన్నై నుంచి డెహ్రాడూన్ వెళ్లిన రజినీకాంత్.. అక్కడి వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించారు.  సామాన్య భక్తుల్లో ఒకరిగా రజినీకాంత్ కలిసిపోయి దేవాలయాలకు వెళ్లారు.  

అక్కడ ఆయన్ను గుర్తుపట్టిన భక్తులు పలకరించారు.  రజినీకాంత్ కూడా వారితో మాట్లాడారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.  ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  కాగా, ఈ ఫొటోలో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.  డెహ్రాడూన్ నుంచి రజినీకాంత్ మహావతార్ బాబాజీ గుహకు వెళ్తారు.  అక్కడ ఐదు రోజులు ఉంటారట.  నవంబర్ నెలలో రజినీకాంత్ హిమాలయాలకు వెళ్ళాలి.  కానీ, నవంబర్ లో షూటింగ్ ఉండటంతో సూపర్ స్టార్ అక్టోబర్ లోనే హిమాలయాలకు వెళ్లారు.  దర్బార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువా శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.