రైతులకు గుడ్‌ న్యూస్.. నేటి నుంచే అమలు..

రైతులకు గుడ్‌ న్యూస్.. నేటి నుంచే అమలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వరుస సంచలన నిర్ణయాలతో పాలనపై తనదైన ముద్ర వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పడమే కాదు. చేతల్లో కూడా చేసి చూపించే విధంగా.. గతంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు శుభవార్త చెప్పారు. ఇవాళ్టి నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు ఏపీ సీఎం. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతోన్న విద్యుత్‌ సరఫరాపై ఆరా తీసిన సీఎం వైఎస్ జగన్... 60 శాతం ఫీడర్లలో పంపుసెట్లకు పగటిపూట ఉచిత విద్యుత్‌ అమలు చేయాలని ఆదేశించారు. మిగతా 40 శాతం ఫీడర్లలో పనులకు రూ.1700 కోట్లు విడుదల చేశారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తి  చేయాలన్నారు. ఇక, సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు.