యడ్డీ కేబినెట్‌ విస్తరణకు సుప్రీం బ్రేక్‌

యడ్డీ కేబినెట్‌ విస్తరణకు సుప్రీం బ్రేక్‌

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు... మంత్రి వర్గ విస్తరణపై మాత్రం ఆంక్షలు విధించింది. అర్ధరాత్రి ఏర్పాటైన సుప్రీం ప్రత్యే బెంచ్‌ ఇవాళ తెల్లవారు జామున  తీర్పు ఇచ్చింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయొచ్చని.. అయితే ప్రభుత్వ ఏర్పాటు మాత్రం తమ తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి జస్టిస్‌ సిక్రీ నేతృత్వంలో ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేశారు.   పీసీసీ నేత పరమేశ్వర, జేడీఎస్‌ నేత కుమారస్వామి వేసిన పిటీషన్‌ను బెంచ్‌ విచారించింది. దీపక్‌ మిశ్రా గృహంలో జరిగిన ఈ విచారణలో వీరి పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు యడ్యూరప్పకు నోటీసు జారీ చేసింది. కేసు ఈనెల 18కి వాయిదా వేసింది.  అంతకుముందు పిటీషనర్ల తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ  న్యాయవాది అభిషేక్‌ సింఘి... యడ్యూరప్ప గవర్నర్‌కు తప్పడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. 15 రోజులు గడువు ఇవ్వడంతో బేరసారాలకు ఆస్కారం ఇస్తుందని వాదించారు. అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదిస్తూ.. గవర్నర్‌ నిర్ణయాలలో కోర్టు జోక్యం చేసుకోలేవని వాదించారు.