ట్రైలర్ కాదు.. సినిమా చూడండి

ట్రైలర్ కాదు.. సినిమా చూడండి

పిఎం నరేంద్ర మోడీ సినిమా ఏప్రిల్ 11 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.  సెన్సార్ పూర్తి చేసుకున్న వెంటనే సినిమాను ఈసీ విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.  దీంతో ఏప్రిల్ 11 వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే.  

ఈ సినిమా రిలీజ్ విషయంపై నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  దీనిపై కోర్టు ఈరోజు విచారణ ప్రారంభించింది.  కేవలం ట్రైలర్ ను మాత్రమే చూసి సినిమాను ఈసీ నిషేదించిందని నిర్మాతలు కోర్టులో పేర్కొన్నారు.  సినిమా చూసిన తరువాత ఓటర్లను ప్రభావితం చేస్తుందో లేదో చెప్పాలని నిర్మాతలు సుప్రీంకు విన్నవించారు.  

నిర్మాతలతో ఏకీభవించిన సుప్రీం కోర్ట్... ఈసీ ఈ సినిమా మొత్తం చూసి తరువాత నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.  మరి దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.