సుప్రీం విచారణ జాబితాలో ఏపీ స్థానిక సంస్థల కేసు..

సుప్రీం విచారణ జాబితాలో ఏపీ స్థానిక సంస్థల కేసు..

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సంఘం నిర్ణయాలతో క్షణక్షణం ఉత్కంఠగా సాగుతోంది.. ఎలాగైనా ఎన్నికలు నిర్వహిస్తామని.. నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ఎన్నికలు ఈ సమయంలో నిర్వహించడం సాధ్యం కాదంటోంది ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.. దీనిపై సోమవారం విచారణ జరపనుంది ఎన్నికల సంఘం.. సోమవారం విచారణ జరిగే కేసుల జాబితాలో ఏపీ స్థానిక సంస్థల కేసు లిస్టయ్యింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా, పంచాయతీ ఎన్నికలపై  హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటోంది.. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలంటే ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడమేనంటున్న ఏపీ సర్కార్.. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసులకు వ్యాక్సినేషన్‌ ఉంటుంది.. ఆ సమయంలో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని పేర్కొంది. ఎన్నికల కమిషనర్‌ దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని.. వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తోంది.