బ్రేకింగ్ : పంచాయతీ ఎన్నికలపై మారిన సుప్రీం బెంచ్

బ్రేకింగ్ : పంచాయతీ ఎన్నికలపై మారిన సుప్రీం బెంచ్

ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపించబోతున్నది.  దీంతో రేపు సుప్రీం కోర్టులో ఏం జరగబోతుందనే ఆసక్తి నెలకొన్నది. నిన్నటి రోజున ఏపీ ఎస్ఈసి తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి తొలి విడత నామినేషన్లు జరగాల్సి ఉంది. అయితే, నామినేషన్లకు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లను అధికారులు చేయలేదు.  ప్రస్తుతం కోడ్ అమల్లోనే ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. అయితే పంచాయతీ ఎన్నికలపై సుప్రీం బెంచ్ మారడం చర్చనీయంశంగా మారింది. కేసు విచారణని జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలో ధర్మాసనం చేయనున్నట్టు తెలుస్తోంది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ముందుకు వెళ్లిన కేసుని రిజిస్ట్రీ వేరే బెంచ్ ముందు రీ లిస్ట్ చేసింది.