దిశ నిందితుల మృతదేహాల అప్పగింత...సుప్రీం కీలక ఆదేశాలు

దిశ నిందితుల మృతదేహాల అప్పగింత...సుప్రీం కీలక ఆదేశాలు


దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింత అంశంపై సుప్రీంకోర్టు నిన్న రాత్రి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మృతదేహాలను భద్రపరచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. మృతదేహాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తేవడంతో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలు అప్పగించాలనే పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరపాల్సి ఉంది. సుప్రీం తాజా ఆదేశాలతో హైకోర్టులో విచారణకు బ్రేక్ పడినట్టే ?  ప్రస్తుతం దిశ హత్య కేసులో నలుగురు నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలో ఉన్నాయి.