ఆ రంగులు తొలగించండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

ఆ రంగులు తొలగించండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాలకు వైసీపీ జెండాలోని రంగులను పోలిన రంగులు వేయడం పెద్ద దుమారానికే దారితీసింది.. వైసీపీ అధికారంలోకి రావడం.. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడంతో.. అప్పటి వరకు ఉన్న గ్రామ పంచాయతీ భవనాల కలర్లు ఒక్కసారిగా మారిపోయాయి.. దీంతో, రంగుల రాజకీయమే నడిచింది ఏపీలో.. మరోవైపు.. ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది.. ప్రభుత్వ కార్యాలయాల రంగులపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని రద్దు చేయాలని గతంలోనే ఆదేశించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. అంతే కాదు.. దానికి డెడ్‌లైన్ కూడా పెట్టింది.. మే 22న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పి దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో సైతం ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.. ఏపీలో గ్రామ పంచాయితీ కార్యాలయాల రంగుల వ్యవహారంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది.. అయితే, అవి వైసీపీ జెండా రంగులు కాదని వాదనలు వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం.. కానీ, నాలుగు వారాల్లో వేసిన రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కారణగా పరిగణించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.