పోలవరంపై విచారణ వాయిదా..

పోలవరంపై విచారణ వాయిదా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. పోలవరంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై ఇవాళ విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం. ఈ ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, స్టాఫ్‌వర్క్‌ ఆర్డర్‌ను పదేపదే నిలుపుదల చేస్తున్నారంటూ తన పిటిషన్‌లో పేర్కొంది ఒడిశా ప్రభుత్వం. దీనిపై వాదనలు వినిపించడానికి 6 వారాలపాటు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరారు ఏపీ తరపు న్యాయవాది జీఎస్ రెడ్డి.. అయితే, పోలవరంపై ఉన్న అనుబంధ అప్లికేషన్‌కు నాలుగు వారాల గడువు ఉన్నందున ఆ మేరకు మాత్రమే సమయం ఇస్తామని తెలిపింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కాగా, జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుపుతోంది.