బ్రేకింగ్: ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు

బ్రేకింగ్: ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు

 ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు దేశ అత్యున్న‌త‌న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా నిర్ధారించిన కోర్టు.. ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా ప్ర‌క‌టించింది సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శాంత్ భూష‌ణ్ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంత‌కుముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయ‌ప‌డిన ధ‌ర్మాస‌నం.. ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని స్పష్టం చేస్తూ దోషిగా తేల్చింది. అయితే, ప్రశాంత్ భూషణ్‌కు శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటామ‌ని తెలిపింది త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం.