సుప్రీం సీరియస్.. కేంద్రం, 10 రాష్ట్రాలకు నోటీసులు..

సుప్రీం సీరియస్.. కేంద్రం, 10 రాష్ట్రాలకు నోటీసులు..

కేంద్ర ప్రభుత్వానికి, 10 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.. మూక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నతన్యాయస్థానం... ఇలాంటి సంఘటనల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానవహక్కుల కమిషన్‌, పది రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీం నోటీసులు జారీ చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మూకదాడులు నిరోధించడానికి గతంలో అత్యున్నత న్యాయస్థానం సూచించిన 11 అంశాలను అమలు చేయడం లేదంటూ ఓ పిటిషన్‌ దాఖలు కాగా... జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని విచారణ చేపట్టింది. ఈ  సందర్భంగా కేంద్రం, 10 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.