ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తే ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్న నిబంధనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీవీప్యాట్లలో లోపాలపై తనకు అనుమానం ఉన్నా.. జైలు శిక్ష నిబంధన నేపథ్యంలో ఫిర్యాదు చేయలేదంటూ ఇటీవల ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి వ్యాఖ్యానించిన నేపథ్యంలో సునీల్‌ ఆహ్యా అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్‌ ధాఖలు చేశారు. ఈవీఎంలో ఓటు వేసినప్పుడు ఏదైనా తేడా గమనించినా.. జైలు శిక్ష నిబంధన వల్ల ఫిర్యాదు చేసేందుకు వెనక్కి తగ్గాల్సి వస్తోందని ఆహ్యా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.