తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టం(2017)ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు పాశం యాదగిరి.. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. ప్రాచీన కట్టడాల చట్టంపై పిటిషనర్ తరపు న్యాయవాది నిరూప్ రెడ్డి వాదనలు వినిపించారు.. ఈ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ శరత్ బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం... ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.