స్వలింగ సంపర్కుల కేసుః తీర్పు నేడే

స్వలింగ సంపర్కుల కేసుః తీర్పు నేడే

పాతికేళ్ళుగా కోర్టుల్లో నానుతున్న సెక్షన్ 377 (స్వలింగ సంపర్కుల కేసు)పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. హోమో సెక్సువాలిటీ నేరమా? కాదా? అన్నది ఇవాళ సుప్రీం తేల్చనుంది. తమ లైంగికత్వం కారణంగా ఎవరూ భయపడుతూ జీవించరాదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తీర్పుపై సర్వాత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మరి కొద్ది రోజుల్లో రిటైర్ కానున్నారు. ఆయన నేతృత్వంలో వెలువడనున్న తీర్పుల్లో ఇది కీలకం కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం గే సెక్స్ నిషేధం. దీనికి పాల్పడినవారికి  పదేళ్ళ జైలు శిక్ష ఉంటుంది. ఈ సెక్షన్ ముసుగులో తమను పోలీసులు వేధిస్తున్నారని ఎల్జీ ఎల్టీ వర్గం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. 377ను  సవాలు చేస్తూ తొలి పిటీషన్ ను 1994లో ఎయిడ్స్ భేద్ భావ్‌ విరోధ్ ఆందోళన వేసింది. ఆ పిటీషన్ కాలం చెల్లిన తరవాత నాజ్ ఫౌండేషన్ 2001లో ఈ సెక్షన్‌ రద్దు కోరుతూ 2001లో ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది.  అప్పటి నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసుపై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది.