కర్ణాటక సంక్షోభంపై సుప్రీం కీలక ఆదేశాలు

కర్ణాటక సంక్షోభంపై  సుప్రీం కీలక ఆదేశాలు

ఇవాళ సాయంత్రం 6 గంటల్లోపు కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఎదుట హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం ఇవాళ విచారణ చేపట్టింది. స్పీకర్ రాజీనామాలపై ఇవాళే తేల్చేసి.. తమకు సమాచారం అందించాలని సుప్రీం తీర్పు సూచించింది. ఎమ్మెల్యేలంతా స్పీకర్‌ ఎదుట హాజరుకావాలని సుప్రీం ఆదేశించడంతో  ముంబైలో ఉన్న ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలంతా బెంగళూరుకు చేరుకునేందుకు తగినంత భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీకి సూచిస్తే విచారణను రేపటికి వాయిదా వేసింది.