ఆర్‌బీఐకి సుప్రీం హెచ్చరిక

ఆర్‌బీఐకి సుప్రీం హెచ్చరిక

భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తన ఖాతాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. ఆర్బీఐ ఖాతాలను, తనిఖీ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని, వెంటనే తన ఖాతాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. ఆర్బీఐ ఖాతాల్లోని అంశాలు, గణాంకాలు సాధారణ పౌరులకు అర్థం కావన్న వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అలాగే, ఆర్బీఐ గవర్నర్‌పై సుప్రీం ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలన్న పిటిషనర్‌ గిరిష్‌ మిట్టల్‌ వాదనను కోర్టు తిరస్కరించింది. జనవరిలో ఇదే విచారణ సందర్భంగా... ఆర్బీఐ ఖాతాలు, వివిధ బ్యాంకు ఖాతాల దర్యాప్తు నివేదికలకు సంబంధించిన అంశాలను ప్రజలకు ఆర్టీఐ చట్టం కింద ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.