ఈసీ, కేంద్రం, ఏపీ, తెలంగాణకు సుప్రీం నోటీసులు

ఈసీ, కేంద్రం, ఏపీ, తెలంగాణకు సుప్రీం నోటీసులు

ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకాలు లేకుండా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఎన్నికల ముందు నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం "పసుపు-కుంకుమ", "అన్నదాన సుఖీభవా'' పథకాల పేరుతో నగదు పంపిణీ చేశారని పిటిషనర్‌.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చంద్రబాబు పథకాలపై నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. అటు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. కేంద్రం, ఈసీతో పాటు రాష్ట్రాలకూ నోటీసులు ఇచ్చింది సుప్రీం.. ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.