బీజేపీకి మరో షాక్ 

బీజేపీకి మరో షాక్ 

భారతీయ జనతా పార్టీకి సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లౌడ్‌స్పీకర్ల ఉపయోగాన్ని నిషేధిస్తూ బెంగాల్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. బీజేపీ పిటిషన్‌ను ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్  సుప్రీం కోర్టు ఇవాళ కొట్టివేసింది. ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువులే ముఖ్యమని సుప్రీం స్పష్టం చేసింది.  పశ్చిమ బెంగాల్  బీజేపీకి ఇది రెండో షాక్. ఇంతకు బీజేపీ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు. తాజా తీర్పుతో బీజేపీ తలపట్టుకుంటోంది. విద్యార్థులకు ఆ నెలల్లో పరీక్షలు ఉండటంతో నివాస గృహాలు, విద్యా సంస్థల సమీపంలో లౌడ్‌స్పీకర్లను నిషేధిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదని బీజేపీ పిటిషన్‌లో పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తున్న సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక వేరే ఉద్దేశమున్నట్లు  పిటిషన్‌లో ఆరోపించారు. విచారణ చేసిన సుప్రీంకోర్టు.... ఎన్నికల ప్రచారం కంటే విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమనీ, వారు చదువులకు ఎలాంటి అటంకం కలుగకుండా ఉండాలంటే పరీక్షల సమయంలో శబ్ద కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

 

 

Supreme Court,  BJP, West Bengal, loud speaker ban