రవి ప్రకాష్ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలంద మీడియా ఫోర్జరీ కేసులో రవిప్రకాష్ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. రవిప్రకాష్ బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు.. 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్‌ను ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపింది సుప్రీం... రవి ప్రకాష్ తరపున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించగా.. హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ రవి ప్రకాష్‌కు సూచించింది సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 10వ తేదీన విచారణ జరిపి ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. రవిప్రకాష్‌ను అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచించింది సుప్రీంకోర్టు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)