ఎమ్మెల్యేల రాజీనామాలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్యేల రాజీనామాలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

చర్చనీయాంశంగా మారిన కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై దేశ అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు కాపిని కోర్టులో సీజేఐ రంజన్ గొగోయ్ చదవి వినిపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై పూర్తిస్వేచ్ఛను స్పీకర్‌ను ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. రాజీనామాలపై కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించలేమని పేర్కొంది. మరోవైపు బలపరీక్ష సమయంలో సభకు హాజరు కావాలా? వద్దా? అనేది ఎమ్మెల్యేల ఇష్టం అని... బలపరీక్షకు ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఎవరూ బలవంతపెట్టలేరని పేర్కొంది సుప్రీం. ఇక, కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కాగా, కర్నాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం గురువారం బలపరీక్ష ఎదుర్కోబోతోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకోనున్నాయనే ఉత్కంఠ నెలకొంది.