మోడి సినిమాపై అభ్యంతరాలేంటో చెప్పండి

మోడి సినిమాపై అభ్యంతరాలేంటో చెప్పండి

పిఎం నరేంద్ర మోడీ సినిమా ఏప్రిల్ 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.  ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  మోడీ సినిమా రిలీజయితే... దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.  

ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలిపింది.  సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకోవడం తమ చేతుల్లో లేదని, సినిమా రిలీజ్ పై ఈసీ కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని సుప్రీం కోర్ట్ పేర్కొంది.  సినిమాపై ఉన్న అభ్యంతరాలు ఏంటో సినిమా చూసి వాటిని పిటిషన్లో పేర్కొంటే... విచారణ చేపడతామని సుప్రీం కోర్ట్ పిటిషనర్స్ సూచించింది.