సుప్రీం కోర్టులో రేపు మరో రెండు కీలక తీర్పులు

సుప్రీం కోర్టులో రేపు మరో రెండు కీలక తీర్పులు

అయోధ్య కేసులో చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు... రేపు మరో రెండు కీలక తీర్పులు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆర్టీఐ యాక్ట్‌లోకి తీసుకురావాలన్న కేసులో..అత్యున్నత న్యాయస్థానం రేపు తుది తీర్పు వెల్లడిస్తుంది. సుప్రీంకోర్టు, సీజేఐ కార్యాలయం ప్రభుత్వ సంస్థలేనని, అవి కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని... 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్‌ 4న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.  చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం రేపు మధ్యాహ్నం దీనిపై  తుది తీర్పు ఇస్తుంది. మరోవైపు  ఫైనాన్స్ చట్టం 2017 ద్రవ్యబిల్లు చెల్లుబాటుకు  సంబంధించి దాఖలైన పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.