రేపే అయోధ్య తీర్పు.. టెన్షన్ లో యూపీ  

రేపే అయోధ్య తీర్పు.. టెన్షన్ లో యూపీ  

ఎన్నో సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్యలోని రామ మందిరం, బాబ్రీ మసీద్ వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పును రేపు వెల్లడించబోతున్నది.  రేపు ఉదయం 10:30 గంటలకు ఈ తీర్పును వెల్లడించబోతున్నది.  ఈ తీర్పు రాబోతున్న తరుణంలో ముందస్తుగా అయోధ్యతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది.  

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.  ఈ కేసు కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసి 40 రోజులపాటు వాదనలు విన్నది.  అక్టోబర్ 16 వ తేదీన ఈ కేసును సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 17 వ తేదీలోగా జడ్జిమెంట్ ను వెల్లడించాలి.  అయితే, దానికంటే ముందుగానే రేపు ఉదయం జడ్జిమెంట్ ను ప్రకటించబోతున్నది.