మోదీ బయోపిక్ పై సుప్రీం సంచలన నిర్ణయం

మోదీ బయోపిక్ పై సుప్రీం సంచలన నిర్ణయం

మోదీ బయోపిక్ ను ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్ చేయకూడదని ఇప్పటికే ఈసీ నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బయోపిక్ దర్శక నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  దీనిపై విచారణ జరిపిన కోర్ట్ ఈరోజు తన తీర్పును వెలువరించింది.  బయోపిక్ సినిమాను ఈ సమయంలో రిలీజ్ చెయ్యొచ్చా లేదా అన్నదే ప్రధాన సమస్య అని... ఈసీ దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకుందని సుప్రీం కోర్ట్ తెలిపింది.  దీనిపై విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.