సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌

సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌
సీబీఐ జడ్జి జస్టిస్‌ లోయా మృతిపై స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే కోర్టు వెబ్‌ సైట్‌ను హ్యాక్‌ చేశారు. అనుమానాస్పద స్థితిలో జస్టిస్‌ లోయా మృతి చెందిన ఘటనపై స్వతంత్ర విచారణ డిమాండ్‌ చేస్తూ కొంత మంది వేసిన పిటీషన్‌ను కోర్టు ఇవాళ తిరస్కరించింది. తీర్పు వచ్చాక కోర్టు వెబ్‌సైట్‌ను బ్రెజిల్‌కు చెందిన హైటెక్‌ బ్రెజిల్‌ హ్యాక్‌ టీమ్‌ హ్యాక్‌ చేసింది. ఎందుకు ఈ పనిచేసిందో ఇంకా తెలియరాలేదు. స్పానిష్‌ లో కొన్ని వాక్యాలను పోస్ట్‌ చేయడంతో పాటు గంజాయి మొక్క ఆకు బొమ్మను పోస్ట్ చేశారు. అధికారులు ఈ మెసేజ్‌ ను వెంటనే తొలగించారు.