ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మెగాహీరో

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మెగాహీరో

సేవ కార్యక్రమాల్లో ముందుండే మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా  ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఏడాది క్రితం 2019లో తన బర్త్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు. విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారని.. అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరారని తెలిపాడు. దాని నిర్మాణ బాధ్యత తీసుకున్నానని.. మెగా ఫ్యాన్స్ కూడా తన బర్త్ డే కి పెట్టే ఖర్చుని ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఇవ్వమని విజ్ఞప్తి చేశాడు. అన్నాడని ప్రకారం సాయి తేజ్ వృద్దాశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. విజయవాడ - సింగ్ నగర్ కాలనీలోని 'అమ్మ ప్రేమ ఆదరణ సేవ' వృద్ధాశ్రమ నిర్మాణాన్ని తేజ్ తన టీమ్ ద్వారా పూర్తి చేసాడు. సాయి ధరమ్ తేజ్ పిలుపు మేరకు మెగా ఫ్యాన్స్ కూడా లక్ష రూపాయల సహాయం చేశారని తెలుస్తోంది. 'అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ' ఓల్డేజ్ హోమ్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇపుడు బయటకు వచ్చాయి.ఈ మంచి పనిలో తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు.