ఆర్బీఐకి సుప్రీం కోర్టు షాక్‌...

ఆర్బీఐకి సుప్రీం కోర్టు షాక్‌...

దేశంలో శరవేగంతా సాగుతన్న మొండిబకాయిల వసూలు యత్నాలకు సుప్రీం కోర్టు బ్రేక్‌ వేసింది. వివిధ చట్టాల్లోని లొసుగుల ఆధారంగా రుణం చెల్లించకుండా.. అలాగే దివాళ పిటీషన్‌ వేయకుండా తప్పించుకు తిరుగుతున్న పారిశ్రామికవేత్తలకు ఝలక్‌ ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 12న భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇన్సాల్వెన్సి అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) చట్టంలోని సెక్షన్‌ 7 కింద దివాళ కంపెనీలపై బ్యాంకులు తీసుకున్న చర్యలను ఇవాళ కోర్టు కొట్టేసినట్లయింది. చాలా ఫాస్ట్‌గా ఈ దివాళా కంపెనీల వ్యవహారాన్ని తేల్చేందుకు ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను తెచ్చినట్లు ఆర్బీఐ చెప్పినా... ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ పేర్కొన్నారు.  దీంతో సుమారు 2.2 లక్షల కోట్ల రూపాయల రుణాలకు చెందిన కేసుల పరిస్థితి అయోమయంలో పడింది. ఎందుకంటే ఐబీసీలోని సెక్షన్‌ 7 కింద చేపట్టిన దివాళ కేసులను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది.

సర్క్యులర్‌ సెన్సేషన్‌
రూ. 2000 కోట్లకు మించిన రుణాలను ఎగవేసిన కంపెనీల వ్యవహారాలను వెంటనే తేల్చాలని లేకుంటే దివాళ పిటీషన్‌ వేసి ముగించాలని ఆర్బీఐ గత ఏడాది ఫిబ్రవరి 12న బ్యాంకులకు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. కార్పొరేట్‌ రంగంలో సంచలనం సృష్టించిన ఈ సర్క్యులర్‌ ఒక విధంగా బ్యాంకింగ్‌ రంగానికి మేలు జరిగింది.  అనేక కంపెనీల దివాళా ప్రక్రియ పరిష్కారం వేగమైంది.  కంపెనీల కేసుల విషయంలో బ్యాంకులు చాలా ఫాస్ట్‌గా  వ్యవహరించాయి. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని పలు కంపెనీలపై బ్యాంకులు భారీగా కేసులు వేశాయి. ఇపుడు సుప్రీం కోర్టు తీర్పుతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.