ఎన్నికల్లో లబ్ది కోసమే టీఎంసీ, బీజేపీ ప్రయత్నం..!

ఎన్నికల్లో లబ్ది కోసమే టీఎంసీ, బీజేపీ ప్రయత్నం..!

కోల్‌కతా పరిణామాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి... అయితే, ఈ పరిణమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అంటున్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. బీజేపీలో చేరిన తృణమాల్ ఎంపీ ముకుల్ రాయ్ ను కాపాడేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆరోపించిన ఆయన.. ఎన్నికల్లో లబ్ది పొందడానికే టీఎంసీ, బీజేపీ ఈ కేసును తెరపైకి తీసుకువచ్చాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర, బెంగాల్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినట్లు ఉంది.. కొంత ఉపశమనం కలిగించినట్టు కూడా ఉందన్నారు సురవరం. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం పొలిటికల్ ఫైట్ జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కొత్త సీబీఐ బాస్‌ ఛార్జ్ తీసుకోకుండా డైరెక్టర్ నాగేశ్వరరావుతో హడావిడి చేయిస్తుంది ఎవరు? అని ప్రశ్నించిన సీపీఐ చీఫ్.. ప్రతిపక్షాలపై ఉన్న పాత కేసులను తిరగతోడుతున్నారని మండిపడ్డారు. విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ పారిపోవడానికి బీజేపీయే కారణమన్న సురవం... కన్నయ్య కుమార్‌పై 1000 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.