ఈసీకి ఆ ధైర్యం ఉందా?: సురవరం

ఈసీకి ఆ ధైర్యం ఉందా?: సురవరం

పశ్చిమ బెంగాల్ లో రెండు పార్టీలు ప్రజలతో చెలగాటం అడుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. బెంగాల్‌ హింసకు బీజేపీ, తృణమూల్‌ పార్టీలు బాధ్యత వహించాలన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనల వల్ల బెంగాల్ సంస్కృతికే అవమానం అని అన్నారు. 
'ఒక రోజు ముందు ఎన్నికల ప్రచారం నిలిపివేయడం సరికాదు. బీజేపీ ఎన్నికల ప్రచారం ముగిసిందనే ప్రచారాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. మతం పేరును ఉపయోగించిన మోడీ, అమిత్‌ షాలపై చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోయింది' అని సురవరం అభిప్రాయపడ్డారు.